భారతదేశం, మే 11 -- Seerat Kapoor: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నటి సీరత్ కపూర్ మధ్య ఉన్న స్నేహంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఒక నెటిజన్ చేసిన అసభ్యకరమైన కామెంట్‌పై సీరత్ అత్యంత హుందాగా, అంతే ఘాటుగా స్పందించారు. ఆడవాళ్లను వస్తువుల్లా చూసే మనస్తత్వంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్ 8న అల్లు అర్జున్ 44వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీరత్ కపూర్, బన్నీ ప్రైవేట్ జెట్‌లో దిగిన కొన్ని అన్ సీన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంపై కొందరు నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా సీరత్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఫోటోను షేర్ చేయగా, ఒక నెటిజన్ హద్దు మీరి "అల్లు అర్జ...