భారతదేశం, జూన్ 25 -- ఎండ తీవ్రత నుంచి వర్షాకాలం ఉపశమనం కలిగించినప్పటికీ, ప్రతి ఏటా ఈ సీజన్ ప్రారంభంలో జ్వరాలు భారీగా పెరుగుతుంటాయి. జ్వరం రాగానే చాలా మంది తమ ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోతుందేమోనని, ప్రతి తుమ్ము లేదా శరీరం వేడెక్కడం చూసి ఏదో తీవ్రమైన వ్యాధి అని భయపడుతుంటారు. వీటన్నింటి మధ్య, వర్షాకాలంలో కుటుంబాలు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు.. వచ్చిన జ్వరం సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షనా లేక ప్రాణాంతక డెంగ్యూ ప్రారంభ లక్షణమా అని తెలుసుకోవడం!

జ్వరం వచ్చిన మొదటి రోజు ఈ రెండు సమస్యల లక్షణాలు ఒకేలా ఉండటం వల్ల తొలి 48 గంటలు అత్యంత కీలకంగా మారతాయి. ఈ సమయంలో లక్షణాలను తప్పుగా అంచనా వేస్తే ప్రాణాలకే ప్రమాదం కావచ్చు, లేదా అనవసరంగా ఆసుపత్రికి పరుగులు తీసి భయాందోళనలు కొనితెచ్చుకున్నట్లవుతుంది.

ఇక్కడే మనకు '48-హవర్ ఫీవర్​ రూల్' ఎంతగానో ఉపయోగపడుతుంది. మన శరీరం ఈ వ...