భారతదేశం, ఆగస్టు 26 -- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునేందుకు ఈరోజు, అంటే ఆగస్ట్​ 26, 2025 చివరి తేదీ. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వీలైనంత త్వరగా sbi.co.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 5,180 క్లర్క్ పోస్టులను ఎస్బీఐ భర్తీ చేయనుంది. పరీక్షల విషయానికొస్తే, ప్రిలిమినరీ పరీక్షలు సెప్టెంబర్ 2025లో, మెయిన్ పరీక్షలు నవంబర్ 2025లో జరిగే అవకాశం ఉంది.

వయోపరిమితి: ఏప్రిల్ 1, 2025 నాటికి అభ్యర్థి వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే, ఏప్రిల్ 2, 1997 కంటే ముందు, లేదా ఏప్రిల్ 1, 2005 తర్వాత పుట్టి ఉండకూడదు.

విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం/సెమిస్టర్ చదువుతున్...