భారతదేశం, జనవరి 30 -- హారర్ కామెడీ మూవీ అనగానే ఓ దెయ్యం.. భయపెడుతూనే నవ్వించే నెరేటివ్.. ఇవే గుర్తుకు వస్తాయి. కానీ మలయాళ హారర్ కామెడీ మూవీ సర్వం మాయ (Sarvam Maya) మాత్రం దీనికి పూర్తి భిన్నమైనది. ఓ క్యూట్ దెయ్యంతో ఓ మనిషి చేసే స్నేహం చుట్టూ తిరిగే కథతో ఆకట్టుకునే సినిమా ఇది.

సర్వం మాయ శుక్రవారమే (జనవరి 30) జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. మలయాళంతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎండీబీలో 8 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమాను అఖిల్ సత్యన్ డైరెక్ట్ చేశాడు. నివిన్ పాలీ లీడ్ రోల్లో నటించగా.. రియా షిబు ఇందులో డెలెలు అనే దెయ్యం పాత్రలో అదరగొట్టింది. అజు వర్గీస్, ప్రీతి ముకుందన్ కూడా కీలకపాత్రలు పోషించారు.

ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇది ప్రభేందు నంబూద్రి అనే ఓ యువకుడు, అనుకోకుండా ఓ దెయ్యంతో అతడు చేసే స్నేహం చుట్టూ తిరుగుతుంది...