భారతదేశం, మార్చి 4 -- కన్నడ హీరోయిన్ సప్తమి గౌడ సంచలన కామెంట్లకు మద్దతు పెరుగుతోంది. హీరోయిన్లను బ్యాక్ సైడ్ నుంచి జూమ్ చేస్తూ బాడీ పార్ట్స్ పై ఫోకస్ పెట్టేలా ఫొటోలు, వీడియోలు తీయొద్దని సప్తమి గౌడ్ రిక్వెస్ట్ చేసింది. ఇలా ఇబ్బంది పెట్టే యాంగిల్స్ లో ఫొటోలు తీయడాన్ని ఖండించింది. ఇప్పుడు సప్తమి గౌడకు హీరోయిన్లు ఆషికా రంగనాథ్, రుక్మిణి వసంత్, దివ్య సపోర్ట్ గా నిలిచారు.

సప్తమి గౌడ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు ఆషికా రంగనాథ్, రుక్మిణి వసంత్, దివ్య తమ మద్దతు తెలిపారు. సప్తమి పోస్టును తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో షేర్ చేశారు. ''రెస్పెక్ట్ అనేది ఉండాలి. కావాలని తీసే జూమ్ ఇన్ ఫొటోలు, అనుచితమైన యాంగిల్స్ అగౌరవాన్ని కలిగిస్తాయి. ఇవి ఆమోదయోగ్యం కాదు'' అని ఆషికా రంగనాథ్ పేర్కొంది.

మహిళా సెలబ్రిటీల వెనుక నుండి ఫోటోలు తీయడంపై సప్తమి గౌడ ఫైర్ అయింది. బయట ఈవ...