భారతదేశం, ఏప్రిల్ 17 -- Sanskruti Jayana: రాజకీయ నాయకుల వారసులు రాజకీయాల్లోకి వెళ్తారు. కానీ సంస్కృతి జయన మాత్రం డిఫరెంట్ మార్గాన్ని ఎంచుకుంది. యాక్టింగ్ వైపు వచ్చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'కృష్ణావతారం పార్ట్ 1: ది హార్ట్' (Krishnavataram) చిత్రంతో సంస్కృతి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది.

ఇప్పుడు సంస్కృతి జయన పేరు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎవరు అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ మనవరాలే ఈ సంస్కృతి జయన. ఇప్పుడు ఆమె వెండితెరకు పరిచయం అవుతుంది.

సంస్కృతి జయనను చూస్తే బ్యూటీ విత్ బ్రెయిన్ అని అనక మానరు. ఈ భామ ఓ వైపు యాక్టింగ్ చేస్తూనే మరోవైపు బిజినెస్ లోనూ రాణిస్తోంది. తన సొంత దుస్తుల కలెక్షన్ ను వెబ్ సైట్లో సేల్ చే...