భారతదేశం, నవంబర్ 10 -- ప్రతి ఏటా మనం జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. అందుకే సంక్రాంతి పండుగను "పెద్ద పండుగ" అని అంటారు. అందమైన రంగురంగుల రంగవల్లికలు, భోగి మంటలు, పిండి వంటలు, గాలిపటాలు, కొత్త బట్టలు ఇలా ఎంతో సందడిగా సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు. అలాగే గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు, కోడిపందాలు, బొమ్మల కొలువులు, కొత్త అల్లుళ్ల సందడులు మధ్య సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటాము.

కాలచక్రానికి అధిపతి, గ్రహాలకు రారాజు అయినటువంటి సూర్యుడు ఆధీనంలో నిరంతరం తిరిగే కాలచక్రంలో రెండు అయనాలు వస్తాయి. ప్రతి ఏడాది ఆరు నెలల పాటు దక్షిణాయనం, మరో ఆరు నెలల పాటు ఉత్తరాయణం వస్తాయి. జనవరి నెల సంక్రాంతి పండుగ సమయంలో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అందుకే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు....