భారతదేశం, మార్చి 2 -- సంజు శాంసన్.. భారత క్రికెట్లో ఈ పేరు ఇప్పుడో సంచలనం. టాలెంట్ ఉన్నా నిలకడ లేకపోవడంతో టీమ్ లోకి వస్తూ, వెళ్తూ ఉండే ఆటగాడిగా శాంసన్ కు పేరు ఉంది. కానీ ఆదివారం (మార్చి 1) అతను అద్భుతం చేశాడు. తన కెరీర్‌ను మార్చేసే ఇన్నింగ్స్ ఆడి, భారత్‌ను టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లోకి చేర్చాడు. వెస్టిండీస్ తో డూ ఆర్ డై మ్యాచ్ లో ఇండియాను గెలిపించాడు.

టీ20 ప్రపంచకప్ లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి రికార్డును సంజు శాంసన్ బ్రేక్ చేశాడు. వెస్టిండీస్ తో మ్యాచ్ లో 196 పరుగుల ఛేజింగ్ లో శాంసన్ 97 నాటౌట్ గా నిలిచాడు. దీంతో టీ20 ప్రపంచకప్ లో ఛేజింగ్ లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డును శాంసన్ బద్దలు కొట్టాడు. కోహ్లి 2016లో ఆస్ట్రేలియాపై, 2022లో పాకిస్థాన్ పై 82 పరుగుల చొప్పున చేశాడు.

11 సంవత్సరాల క్రితం భారత్ తరపున టీ...