భారతదేశం, మార్చి 7 -- సంగీత్ శోభన్.. ఈ టాలీవుడ్ యువ హీరో చేసింది కొన్ని సినిమాలే అయినా యూత్ ఆడియెన్స్ లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ముఖ్యంగా మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు సంగీత్ ను ఓ స్టార్ ను చేశాయి. అయితే తనకు గనుక ఛాయిస్ ఇచ్చి ఉంటే మ్యాడ్ స్క్వేర్ చేసేవాడిని కాదని అతడు అనడం గమనార్హం.

తాజాగా Gulte.comకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మ్యాడ్ స్క్వేర్' గురించి సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. "మ్యాడ్ (Mad) సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత, నెక్స్ట్ ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ సక్సెస్ ఎంజాయ్ చేసే మూడ్‌లో ఉండిపోయాను. మ్యాడ్ స్క్వేర్‌ను చాలా తక్కువ సమయంలో పూర్తి చేసేశాం. నిర్మాత నాగవంశీ అన్న కూడా ఇదే విషయాన్ని ఫీలయ్యారు" అని పేర్కొన్నాడు.

అంతేకాకుండా.. "ఈ సినిమాలో క్రైమ్-కామెడీ ట్రాక్‌పై మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ...