భారతదేశం, సెప్టెంబర్ 2 -- Sandeep Reddy Vanga: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'స్పిరిట్' (Spirit) గురించి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఊహించని సంచలన అప్‌డేట్ ఇచ్చేశారు. రీసెంట్‌గా జరిగిన 'రోమాంచకం' ప్రమోషన్స్ కార్యక్రమంలో సందీప్ వంగా మాట్లాడుతూ.. స్పిరిట్ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్ ఆల్రెడీ ఒక మైండ్ బ్లాకింగ్ చార్ట్‌బస్టర్ సాంగ్ కంపోజ్ చేసినట్లు రివీల్ చేశారు.

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఏ ఈవెంట్‌కు వచ్చినా అక్కడ మ్యాటర్ నెక్స్ట్ లెవెల్‌లోనే ఉంటుంది. 'రోమాంచకం' ప్రమోషనల్ ఈవెంట్‌లో సందీప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 'స్పిరిట్' మ్యూజిక్ వర్క్స్ ఎంత వేగంగా జరుగుతున్నాయో చెబుతూ.. వాసుకి వైభవ్ ఇచ్చిన పాట వింటే థియేటర్లలో ఆడియన్స్ విజిల్స్ వేయడం ఖాయమని సందీప్ ఫ...