భారతదేశం, జూలై 14 -- Sandeep Reddy Vanga: టాలీవుడ్‌లో కమర్షియల్ ఫార్ములా సినిమాలకు భిన్నంగా, రియలిస్టిక్ కథలతో ప్రయోగాలు చేసే అతికొద్ది మంది దర్శకులలో వెంకటేష్ మహా ఒకరు. ఆయన సత్యదేవ్‌తో కలిసి తెరకెక్కించిన లేటెస్ట్ ఫిల్మ్ 'రావు బహదూర్'. థియేటర్లలో క్లాస్ ఆడియన్స్‌ను కదిలిస్తున్న ఈ చిత్రానికి ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నుంచి ఊహించని మద్దతు లభించింది.

సాధారణంగా సందీప్ రెడ్డి వంగా సినిమాలు లార్జర్ ద్యాన్ లైఫ్ క్యారెక్టరైజేషన్స్‌తో, ఇంటెన్స్ వయలెన్స్‌తో ఉంటాయి. కానీ వెంకటేష్ మహా శైలి పూర్తిగా భిన్నం. అత్యంత సహజంగా, సమాజంలోని పాత్రలను స్క్రీన్‌పై చూపిస్తూ డ్రామాను పండించడం మహా స్పెషాలిటీ. ఇలాంటి విభిన్న శైలి కలిగిన డైరెక్టర్ తెరకెక్కించిన 'రావు బహదూర్' చూసి సందీప్ వంగా ఎమోషనల్ కావడం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో...