భారతదేశం, మార్చి 2 -- టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా అదరగొట్టింది. సూపర్ 8లో తన లాస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ ను ఓడించి సెమీఫైనల్ కు అర్హత సాధించింది. ఆదివారం (మార్చి 1) రాత్రి ముగిసిన ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ హీరో. అమేజింగ్ బ్యాటింగ్ తో జట్టును గెలిపించాడు. దీంతో శాంసన్ కు కెప్టెన్ సూర్యకుమార్ తలవంచిన వీడియో వైరల్ గా మారింది.

ఆదివారం రాత్రి ముగిసిన ఇండియా వర్సెస్ వెస్టిండీస్ పోరు ఉత్కంఠ రేకెత్తింది. ఈ మ్యాచ్ లో ఇండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 196 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ 97 రన్స్ తో నాటౌట్ గా నిలిచి భారత్ ను గెలిపించాడు. దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత శాంసన్ డగౌట్ వైపు వెళ్లే క్రమంలో కెప్టెన్ సూర్యకుమార్ చేసిన ఓ పని నెటిజన్ల ప్రశంసలు పొందుతోంది.

టీమ్ ను గెలిపించిన తర్వాత మిక్స్ డ్ ఎమోషన్లతో...