భారతదేశం, జూలై 10 -- Samantha Akhil: స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన మాజీ మరిది అఖిల్ అక్కినేని కొత్త మూవీ 'లెనిన్' ట్రైలర్ షేర్ చేస్తూ టీమ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మధ్యే మా ఇంటి బంగారం మూవీపై అఖిల్ ప్రశంసలు కురిపించగా.. ఇప్పుడు లెనిన్ రిలీజ్ రోజే అఖిల్ తోపాటు మొత్తం మూవీ టీమ్ కు సమంత బెస్ట్ విషెస్ చెప్పింది.

సమంత శుక్రవారం (జులై 10) ఇన్‌స్టా స్టోరీస్ లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో సమంత రాస్తూ.. "లెనిన్, అఖిల్ అక్కినేని, మొత్తం టీమ్ కు ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పటికే పెద్ద బ్లాక్‌బస్టర్ వైబ్స్ వచ్చేస్తున్నాయి" అంటూ స్ట్రాంగ్ మజిల్ ఎమోజీలను జోడించారు. ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ కొడుతుందనే నమ్మకాన్ని సామ్ వ్యక్తం చేయడం విశేషం.

నాగచైతన్యతో విడాకుల తర్వాత కూడా ...