భారతదేశం, జూన్ 16 -- Samantha: మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి స్టార్ హీరోయిన్ సమంత రెడీ అయింది. యాక్షన్ తో అదరగొట్టేందుకు 'మా ఇంటి బంగారం' మూవీతో థియేటర్లలోకి రాబోతోంది. సోమవారం (జూన్ 15) రాత్రి హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సమంత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా సామ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న ప్రేమకు సమంత ఎమోషనల్ అయింది. "మూడు సంవత్సరాలు అయింది. అయినా మీరు అదే సపోర్ట్, అదే ప్రేమ చూపిస్తున్నారు. మీకు ఎంతో రుణపడి ఉంటా" అని సామ్ పేర్కొంది. అభిమానుల కోరిక తనకు అర్థమైందని, ఇకపై ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తానని సామ్ ప్రామిస్ చేసింది.

ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేయాలని సమంత ...