భారతదేశం, ఏప్రిల్ 24 -- Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు, బాక్సాఫీస్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ అంటేనే రికార్డుల వేట. ముఖ్యంగా 'ఈద్' పండుగ వచ్చిందంటే థియేటర్ల వద్ద సల్మాన్ మేనియా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొంతకాలంగా సరైన సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సల్మాన్.. ఇప్పుడు తన మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో తన ఈద్ (రంజాన్)కు తిరిగి వచ్చేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. వచ్చే ఏడాది ఈద్ కానుకగా సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి మూవీ రిలీజ్ కానుంది.

సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి మూవీని ఈ మధ్యే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా.. నయనతార ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ విండో వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా సల్మాన్, నయనతార, వంశీ పైడిపల్లి రావడం ఈ వీడియోలో...