భారతదేశం, జూలై 11 -- Salman Khan: బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్స్ ఆస్తులు కొనడం, అమ్మడం ఒక సాధారణ విషయమే. అయినప్పటికీ సల్మాన్ ఖాన్ (Salman Khan) రియల్ ఎస్టేట్ డీల్స్ ఎప్పుడూ నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తాజాగా ఈ కండల వీరుడు ముంబైలోని అత్యంత విలాసవంతమైన బాంద్రా వెస్ట్ (Bandra West)లోని ఒక అపార్ట్‌మెంట్‌ను అమ్మేశాడు.

సిఆర్ఇ మాట్రిక్స్ (CRE Matrix) సేకరించిన పత్రాల ప్రకారం.. బాంద్రా వెస్ట్‌లోని 'శివ్-ఆస్థాన్ హైట్స్' బిల్డింగ్‌లో ఉన్న ఈ ఫ్లాట్‌ను సల్మాన్ ఖాన్ జూలై 9, 2026న అధికారికంగా రిజిస్టర్ చేశాడు.

సల్మాన్ ఖాన్ ఆస్తుల హిస్టరీని గమనిస్తే.. గత ఏడాది (జూలై 2025) లో కూడా ఇదే శివ్ ఆస్థాన్ హైట్స్ బిల్డింగ్‌లో ఉన్న తన మరొక 1,318 చదరపు అడుగుల పెద్ద అపార్ట్‌మెంట్‌ను రూ. 5.35 కోట్లకు అమ్మేశాడు. ఒకవైపు పాత ఫ్లాట్లను విక్రయిస్త...