భారతదేశం, జూలై 9 -- Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీపై లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్ లో డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్' (Dhurandhar) ఫ్రాంచైజీ ఇండియన్ సినిమా రూపురేఖలను పూర్తిగా మార్చేసిందని ఆయన ఓపెన్ గా ఒప్పుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో ఏ సినిమా చూసినా ధురంధర్ కంటే ముందు, ఆ తర్వాత అనేలా ట్రెండ్ నడుస్తోందని చెప్పారు.

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాతో మాట్లాడిన సైఫ్ అలీ ఖాన్.. ధురంధర్ సినిమాలో వాడిన సౌండ్‌ట్రాక్, మ్యూజిక్ సిస్టమ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. "ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్లంతా ఈ కొత్త ట్రెండ్ అందుకుంటారా లేదా అనేది వాళ్ల ఇష్టం. ప్రతి సినిమాకు ఒక కొత్త ఆల్బమ్ క్రియేట్ చేయడం కంటే, గ్లోబల్ వైడ్ ఉన్న బెస్ట...