భారతదేశం, జూలై 24 -- Sai Pallavi: రామానంద్ సాగర్ క్లాసిక్ టీవీ సీరియల్ 'రామాయణ్'లో సీతగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న నటి దీపికా చిక్లియా.. బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ 'రామాయణ్' లో సీత పాత్ర పోషిస్తున్న సాయి పల్లవి (Sai Pallavi) పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. నితీష్ తివారీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీలో సాయి పల్లవి సీతగా ఎలా కనిపిస్తుందో ఊహించలేకపోతున్నానని ఆమె వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

తులసీదాస్ రాసిన రామచరితమానస్‌లో సీతాదేవి వర్ణన చాలా స్పష్టంగా ఉందని దీపికా చిక్లియా చెప్పారు. బాదం పప్పు ఆకారపు కళ్లు, నిర్దిష్టమైన రూపురేఖలతో ఉండేలా వర్ణించారు. ఆ రోజుల్లో రామానంద్ సాగర్ సరిగ్గా అలాంటి పోలికలు ఉన్న నటి కోసం వెతికి తనను ఎంపిక చేశారని దీపికా చిక్లియా గుర్తుచేసుకున్నారు.

సాయి పల్లవి చాలా అద్భ...