భారతదేశం, ఫిబ్రవరి 24 -- సౌత్ ఇండియన్ సినిమా అభిమానులకు ఒక అద్భుతమైన వార్త. ఇండియన్ సినిమా గర్వించదగ్గ దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా ఒక అందమైన రొమాంటిక్ డ్రామా రాబోతోందని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ, నటుడు విజయ్ సేతుపతి స్వయంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ధృవీకరించాడు.

తమ అద్భుతమైన నటనతో ఎలాంటి పాత్రకైనా ప్రాణం పోయగల సత్తా ఉన్న ఇద్దరు గొప్ప నటులు విజయ్ సేతుపతి, సాయి పల్లవి (Sai Pallavi). ఇప్పుడు వీరిద్దరూ ఒకే తెరపై, అది కూడా మణిరత్నం లాంటి మాస్టర్ ఫిల్మ్ మేకర్ దర్శకత్వంలో సందడి చేయబోతున్నారు. ఈ రొమాంటిక్ డ్రామా ప్రాజెక్ట్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, విజయ్ సేతుపతి స్వయంగా స్పందించి అభిమానులకు గుడ్ ...