భారతదేశం, నవంబర్ 16 -- Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఎంపిక చేసుకునే పాత్రలు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటాయి. 'రామాయణం' సినిమాలో సీతగా ఆమె ఛాలెంజింగ్ రోల్ చేసింది. ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'ఓం: చాప్టర్ 1 - ఉధిరమ్: ది బ్లడ్ వుడ్' చిత్రంలో సిబిఐ ఆఫీసర్‌గా ఆమె కనిపించనుంది. ఈ పవర్‌ఫుల్ క్యారెక్టర్ కోసం తన ట్రేడ్‌మార్క్ అయిన తన జుట్టును కత్తిరించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

తాజాగా బిహైండ్‌వుడ్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. "కథ విన్న తర్వాత నా పాత్రను ఎలా చూపిస్తారో అర్థం చేసుకున్నా. ఆ పాత్రకు తగ్గట్టుగా నన్ను నేను మార్చుకోవాలనుకున్నా. నాకు ఆ కథ ఎంతగానో నచ్చడంతో నా జుట్టు కత్తిరించుకోవడానికి కూడా సిద్ధమయ్యా. కటింగ్ పూర్తయ్యాక నా కొత్త లుక్‌ను ముందుగా మా అమ్మకు వ...