భారతదేశం, జూలై 11 -- S Janaki: భారతీయ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. 'నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా'గా, 'జానకమ్మ'గా కీర్తి పొందిన వెటరన్ ప్లేబ్యాక్ సింగర్ ఎస్.జానకి తన 88వ ఏట తుదిశ్వాస విడిచారు. ఇవాళ (జూలై 11) మైసూర్ లో కన్నమూశారు.

కొన్ని వేల పాటలతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న లెజండరీ సింగర్ ఎస్.జానకి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు అప్సర ఇన్ స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించింది. ఫ్యామిలీ ప్రేమ మధ్య జానకమ్మ ప్రశాంతంగా కన్నుమూశారని ఆమె పేర్కొంది.

జానకమ్మ కేవలం సింగర్ మాత్రమే కాదు.. ఆమె ఓ ధీర వనిత కూడా. 2013లో కేంద్ర ప్రభుత్వం ఎస్.జానకికి దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మభూషణ్' (Padma Bhushan) అవార్డును ప్రకటించింది. అయితే, ఆమె ఆ అవార్డును స్వీకరించడానికి నిరాకరించి, దేశవ్యాప్తంగా సంచలనం సృష...