భారతదేశం, అక్టోబర్ 6 -- రష్యాలోని సుదూర సైబీరియా ప్రాంతంలో ఊహించని ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొంది! ఇర్కుట్స్క్ ప్రాంతంలోని ఒక ల్యాబొరేటరీలో జరిగిన ప్రమాదం కారణంగా ప్రాణాంతక 'న్యూమోనిక్ ప్లేగ్' ఇన్ఫెక్షన్ వ్యాపించి, 28 ఏళ్ల ల్యాబ్ టెక్నీషియన్ దరియా షిపిలోవా అనే మహిళ మరణించింది. ఈ దురదృష్టకర సంఘటనతో అప్రమత్తమైన రష్యా అధికారులు ముందస్తు జాగ్రత్తగా ఐదు ప్రధాన ఆసుపత్రులను మూసివేశారు. బాధితురాలితో సన్నిహితంగా మెలిగిన 200 మందికి పైగా వ్యక్తులను గుర్తించి అత్యంత కఠినమైన క్వారంటైన్‌లో ఉంచారు. వ్యాధి సంక్రమణ భయాలతో ఇర్కుట్స్క్ నగరంలో జరగాల్సిన అన్ని రకాల బహిరంగ కార్యక్రమాలను కూడా అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.

షెలెకోవ్‌లోని 'యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్'లో పనిచేస్తున్న దరియా షిపిలోవా, పరీక్షల కోసం నమూనాలు సేకరిస్తున్న సమయంలో సజీవ ...