భారతదేశం, ఆగస్టు 25 -- గ్రూప్ డీ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్​ఆర్బీ) త్వరలో ప్రకటించనుంది. దేశవ్యాప్తంగా వివిధ డిపార్ట్‌మెంట్లలో ఉన్న మొత్తం 32,438 ఖాళీలను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. పరీక్ష తేదీల షెడ్యూల్ విడుదలైన తర్వాత అడ్మిట్ కార్డులు కూడా జారీ చేస్తారు. అభ్యర్థులు వీటిని rrbcdg.gov.in అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా లెవల్ 1 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ట్రాక్ మెయింటెయినర్ గ్రేడ్-IV, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎస్&టి టెక్నికల్ డిపార్ట్‌మెంట్లు, హెల్పర్/అసిస్టెంట్, అసిస్టెంట్ పాయింట్స్‌మ్యాన్ వంటివి ఉన్నాయి.

ఎంపిక ప్రక్రియలో అనేక దశలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి:

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ)

డాక్యుమెంట...