భారతదేశం, ఏప్రిల్ 7 -- వైభవ్​ సూర్యవంశీ.. క్రికెట్​ ప్రపంచంలో ఈ 15ఏళ్ల యువకుడు ఇప్పుడొక సంచలనం! రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ఈ యంగ్​ గన్.. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను చిత్తు చేశాడు. అయితే, ఈ రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతనికి అసలైన పరీక్ష ఎదురుకానుంది! ప్రపంచ నంబర్ వన్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను వైభవ్ ఎలా ఎదుర్కోబోతున్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్. అగ్రశ్రేణి బ్యాటర్లనే బెంబేలెత్తించే బుమ్రాని వైభవ్​ డామినేట్​ చేస్తే.. అతనికి టీమిండియా జెర్సీ అందడం ఖాయం అని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

షార్దూల్ ఠాకూర్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ సిరాజ్ వంటి సీనియర్లను ఉతికేసిన వైభవ్‌కు, బుమ్రా రూపంలో ఒక గండం ఎదురుకానుంది. దశాబ్ద కాలంగా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న బుమ్రా, తన బౌలింగ్‌ను నిరంతరం అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఎ...