భారతదేశం, సెప్టెంబర్ 1 -- Romanchakam: బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్ చేస్తున్న లేటెస్ట్ యూత్‌ఫుల్ రోమ్‌కామ్ 'రోమాంచకం' సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు.

ఈ రోమాంచకం సినిమా విశేషాలను నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా విలేకరుల సమావేశంలో వివరంగా పంచుకున్నారు. తాము ఏదో కార్పొరేట్ పద్ధతిలో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసుకుని, లెక్కలు వేసి సినిమాలు తీసే రకం కాదని ఆయన స్పష్టం చేశారు.

గతంలో కొన్ని కథలు విన్నా తమ సెన్సిబిలిటీస్‌కి మ్యాచ్ కాకపోవడంతో వాటిని పక్కన పెట్టామని తెలిపారు. ఈ కథలో ఫ్రెండ్స్ మధ్య ఉండే హ్యూమర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా సహజంగా కుదిరాయని వెల్లడ...