భారతదేశం, మే 9 -- Rohit Sharma: పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బ్రాడ్‌కాస్టర్లు ఊహించని పొరపాటు చేశారు. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సమయంలో పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్ ను చూపించబోయి.. ఏకంగా టీమిండియా ఆటగాళ్ల పేర్లను ఆ స్థానంలో పెట్టేశారు. రోహిత్ ను కెప్టెన్ చేసేశారు. ఈ విచిత్రమైన తప్పిదం చూసిన క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోవడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా పాక్ క్రికెట్ బోర్డుపై, బ్రాడ్‌కాస్టర్లపై జోకులు పేలుస్తున్నారు.

మ్యాచ్ సాగుతున్న సమయంలో స్క్రీన్‌పై పాక్ జట్టు గ్రాఫిక్ కనిపించింది. అందులో ఉండాల్సింది షాన్ మసూద్ సేన.. కానీ అక్కడ ప్రత్యక్షమైనవి మాత్రం రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేష్ శర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార...