భారతదేశం, సెప్టెంబర్ 26 -- Rohit Kohli: 2024 టీ20 ప్రపంచకప్ విక్టరీ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు, ఆ తర్వాత టెస్టులకు వీడ్కోలు పలికిన టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కన్ను ఇప్పుడు 2027 వన్డే ప్రపంచకప్‌పైనే పడింది. వెస్టిండీస్‌తో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు ముందు జియోహాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో మాట్లాడిన రో-కో సంచలన వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఏడాది దక్షణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీయే భారత్ తరఫున తాను ఆడే చివరి వరల్డ్ కప్ అని రన్‌మెషిన్ విరాట్ కోహ్లి అధికారికంగా స్పష్టం చేశారు.

"వన్డే వరల్డ్ కప్ ఇంటెన్సిటి చాలా ఎక్కువగా ఉంటుంది. టీ20 ఇంటెన్సిటీతో 10 మ్యాచ్‌లు ఆడటం సాధారణ విషయం కాదు. పైగా విదేశీ పిచ్‌లపై ఈ సవాలు మరీ ఎక్కువ. ఇది భారత్ తరఫున నాకు చివరి ప్రపంచకప్ (2027). అందుకే నా...