భారతదేశం, మార్చి 4 -- చిత్తూరు జిల్లాలో బుధవారం ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని.. వేగంగా వచ్చిన కారు వెనకాల నుంచి ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే చనిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

చిత్తూరు జిల్లా గంగవరం మండలం దండపల్లి క్రాస్ వద్ద బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. మృతులను కర్ణాటక వాసులుగా గుర్తించారు. మృతులు మోహన్‌దాస్, నాగరాజారావు, కుసుమ, జయంతి, పూజ.

బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మితిమీరిన వ...