భారతదేశం, ఫిబ్రవరి 27 -- భారత క్రికెట్ స్టార్ రింకు సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రాణాంతకమైన స్టేజ్​-4 క్యాన్సర్‌తో గత కొంతకాలంగా పోరాడుతున్న ఆయన తండ్రి ఖాన్‌చంద్ సింగ్ శుక్రవారం కన్నుమూశారు. ఈ విషాద వార్తను భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ, రింకు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

"రింకు సింగ్​ తండ్రి శ్రీ ఖాన్​చంద్​ సింగ్​ మరణించారన్న వార్త చాలా బాధ కలిగించింది. టీ20 ప్రపంచ కప్ కోసం కట్టుబడి ఉన్నప్పటికీ,​ రింకుకు, అతని కుటుంబానికి ఇది అత్యంత బాధాకరమైన సమయం. రింకు కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. అతని తండ్రి ఆత్మకు శాంతి కలగాలని, ఈ గడ్డు కాలంలో రింకు కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని వాహేగురును కోరుకుంటున్నాను," అని హర్భజన్​ సింగ్​ ఎక్స్​లో ట్వీట్​ చేశారు.

ఖాన్‌చంద్ సింగ్ గ్రేటర్ నోయిడాలోన...