భారతదేశం, ఫిబ్రవరి 27 -- కొడుకు కెరీర్ కోసం కష్టాలు పడి, తనయుడి క్రికెట్ కలను నిజం చేసిన వ్యక్తి గురించి మీకు చెప్పాలి. ఇప్పుడు ఆ కొడుకు టీమిండియాకు ఆడుతున్నాడు. తండ్రి కష్టాన్ని వృథా కానివ్వలేదు. ఆ క్రికెటర్ పేరు రింకు సింగ్. రింకు కెరీర్ ను తీర్చిదిద్దిన ఆ తండ్రి ఖాన్‌చంద్‌ సింగ్. ఇవాళ (ఫిబ్రవరి 27) ఉదయం ఖాన్‌చంద్‌ మరణించారు. చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారు.

రింకు సింగ్ ను క్రికెటర్ చేయడం కోసం ఖాన్‌చంద్‌ చాలా కష్టపడ్డారు. ఇండియన్ ఆయిల్ కు చెందిన గ్యాస్ కంపెనీ ఇండేన్‌లో ఖాన్‌చంద్‌ పనిచేశారు. రోజు ఎల్పీజీ సిలిండర్లు డెలివరీ చేసేవారు. ఆ సిలిండర్లను భుజాలపై మోసేవారు. ఈ సంపాదనతోనే కొడుకుకు క్రికెట్లో మెరుగైన శిక్షణ అందించారు.

ఇండియన్ క్రికెటర్ గా రింకు సింగ్ ఎదిగిన తర్వాత కూడా ఖాన్‌చంద్‌ తన పని కొనసాగించారు. రింకు వద్దని చెప్పినా తండ్రి...