భారతదేశం, ఏప్రిల్ 17 -- RGV Underworld: 1990వ దశకంలో ముంబై అండర్ వరల్డ్.. బాలీవుడ్ ఇండస్ట్రీని ఎలా గజగజలాడించిందో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా వివరించాడు. రాకేశ్ రోషన్ పై హత్యాప్రయత్నం, గుల్షన్ కుమార్ దారుణ హత్య వెనుక ఉన్న మాఫియా లెక్కలను అతడు బయటపెట్టాడు.

ముంబై మాఫియా కథలను వెండితెరపై ఆవిష్కరించడంలో రామ్ గోపాల్ వర్మ (RGV) సిద్ధహస్తుడు. 'సత్య', 'కంపెనీ' వంటి చిత్రాలతో అండర్ వరల్డ్ అంతరాలను చూపించిన అతడు.. తాజాగా క్రైమ్ రైటర్ హుస్సేన్ జైదీతో జరిగిన సంభాషణలో 1990వ దశకంలోని భయానక పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.

ఆ కాలంలో దావూద్ ఇబ్రహీం, అబూ సలేం వంటి గ్యాంగ్‌స్టర్లు బాలీవుడ్ అగ్ర హీరోలను, నిర్మాతలను ఎలా తమ గుప్పిట్లో ఉంచుకోవాలని చూశారో ఆర్జీవీ వివరించాడు.

మాఫియా పనితీరు చాలా లెక్కలతో కూడుకుని ఉంటుందని వర్మ విశ్లేషించాడు. "అండర్ ...