భారతదేశం, నవంబర్ 9 -- RGV Ramayana Review: నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న 'రామాయణం' మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై సాధారణ ప్రేక్షకుల నుంచే కాకుండా సినీ విశ్లేషకులు, ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

తాజాగా ఈ సినిమాను చూసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘమైన విశ్లేషణాత్మక పోస్ట్ రాసుకొచ్చారు. రామాయణాన్ని చాలామంది సాధారణ భక్తి చిత్రంగా భావిస్తారని, కానీ ఈ సినిమా భక్తికి మించిన ఒక పవర్‌ఫుల్ దృశ్య కావ్యమని వర్మ అభివర్ణించారు.

సాధారణంగా పౌరాణిక చిత్రాల్లో దేవుళ్లను చూపించే విధానానికి, నితేష్ తివారీ ఆవిష్కరించిన రాముడి పాత్రకు చాలా తేడా ఉందని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు.

"ఈ సి...