భారతదేశం, జూన్ 9 -- RGV on Movie Reviews: థియేటర్ల వద్ద పబ్లిక్ టాక్, యూట్యూబ్ రివ్యూలను నియంత్రించాలనే టాలీవుడ్ నిర్మాతల ఆలోచనలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సంచలన వ్యాఖ్యలు చేశాడు. నెగెటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన 'యానిమల్' సినిమాను ఉదాహరణగా చూపిస్తూ, ప్రేక్షకుల అభిప్రాయాలను ఆపడం ఎవరి తరం కాదని తేల్చిచెప్పాడు.

ఇటీవల కాలంలో సినిమా విడుదలైన మొదటి రోజే థియేటర్ల పరిసరాల్లో యూట్యూబ్ ఛానెళ్లు తీసుకునే "Movie Public Talk" వల్ల ఓపెనింగ్స్ దెబ్బతింటున్నాయని టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొన్ని థియేటర్ల వద్ద మైకులు పట్టుకుని రివ్యూలు అడగడాన్ని నిషేధించే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి.

రివ్యూలపై బ్యాన్ విధించాలనే డిమాండ్ల నేపథ్యంలో ఆర్జీవీ రియాక్షన్ వైరల్ గా మారింది. "ఒక సినిమాను చ...