భారతదేశం, సెప్టెంబర్ 14 -- RGV Movie: బాలీవుడ్‌లో సరికొత్త సంచలనానికి తెరలేచింది. అండర్‌వరల్డ్ చిత్రాల ట్రెండ్‌సెట్టర్ రామ్ గోపాల్ వర్మ, లవ్ స్టోరీల స్పెషలిస్ట్ మోహిత్ సూరి చేతులు కలిపారు. ముంబై అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ విడిపోయిన సంచలనాత్మక ఘటనల ఆధారంగా వీరిద్దరూ ఒక భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామాను రూపొందిస్తున్నారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ఆర్జీవీ స్క్రిప్ట్ అందించడంతో పాటు కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండగా, మోహిత్ సూరి దర్శకత్వం వహించనున్నారు. "గ్యాంగ్‌స్టర్ కర్రీలో లవ్ డిష్ వండుతున్నాం" అంటూ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సెల్ఫీ షేర్ చేసి అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 'సత్య', 'కంపెనీ' సినిమాలతో గ్యాంగ్‌స్టర్ జోనర్‌కు బెంచ్‌మార్క్ సెట్ చేసిన ఆర్జీవీ.. 'సయ్యారా' లాంటి ఎమోషనల్ బ్లాక్‌బస్టర్ ఇచ్...