భారతదేశం, మే 22 -- RGV Michael Review: టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఎప్పుడూ సరికొత్త చర్చకు దారితీస్తాయి. తాజాగా ఆయన చేసిన ఒక సుదీర్ఘమైన పోస్ట్ నెటిజన్ల గుండెలను పిండేస్తోంది. పాప్ కింగ్, దివంగత మైఖేల్ జాక్సన్ (MJ) పై తనకున్న అమితమైన ప్రేమను, ఆయన మరణం కలిగించిన తీరని వేదనను వర్మ అక్షర రూపంలో పంచుకున్నారు. "నేను మైఖేల్ జాక్సన్‌ను ద్వేషిస్తున్నాను" అంటూ ప్రారంభించిన ఈ సందేశం ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

మైఖేల్ జాక్సన్ బయోపిక్ మైఖేల్ మూవీ చూసిన తర్వాత తనకు కలిగిన భావాలను ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా 2009 జూన్ 25 నాటి భయంకరమైన రోజును వర్మ గుర్తు చేసుకున్నారు. ఆ రాత్రి ఆలస్యంగా నిద్రపోయి, ఉదయాన్నే లేచి చూసేసరికి టీవీ స్క్రీన్‌పై నలుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌లో తెల్లటి అక్షరాలతో ఒ...