భారతదేశం, ఏప్రిల్ 7 -- RGV Birthday: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ). అతడు ఏం చేసినా, ఏం మాట్లాడినా అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా ఎవరైనా పుట్టినరోజున 'మరో వసంతంలోకి అడుగుపెట్టాను' అని సంతోషంగా చెప్పుకుంటారు. కానీ వర్మ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించాడు. మంగళవారం (ఏప్రిల్ 7) తన పుట్టినరోజు సందర్భంగా అతడు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రతి ఏటా తన పుట్టినరోజున ఏదో ఒక విభిన్నమైన పోస్ట్ పెట్టే రామ్ గోపాల్ వర్మ.. ఈసారి మరణం గురించి ప్రస్తావించాడు. "ఈ రోజు నేను నా చావుకు మరో ఏడాది దగ్గరయ్యాను. కాబట్టి దీని గురించి మనం సెలబ్రేషన్స్ చేసుకోవద్దు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీకు సంతోషం కలిగితే తప్ప, నా కోసం మాత్రం వేడుకలు జరపకండి. ధన్యవాదాలు" అంటూ అతడు ఎక్స్ వేదికగా రాస...