భారతదేశం, సెప్టెంబర్ 1 -- RGV Allu Aravind: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'టాక్సిక్' థియేటర్లలో నెగెటివ్ టాక్‌ను ఎదుర్కొంటున్న వేళ, సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కామెంట్స్ సోషల్ మీడియాలో మళ్లీ తెరపైకి వచ్చాయి. కేజీఎఫ్ సిరీస్ కంటే ముందు యశ్ ఎవరో ఎవరికీ తెలియదంటూ గతంలో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్‌పై వివాదం రేగగా, దర్శక సంచలనం రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చి సంచలన రీతిలో స్పందించారు.

యశ్ స్టార్‌డమ్ గురించి అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యల వివాదంపై రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్ ఖాతాలో సుదీర్ఘంగా స్పందించారు. ఈ వివాదాన్ని అత్యంత హాస్యాస్పదమైనదని అభివర్ణించిన ఆర్జీవీ.. అల్లు అరవింద్ అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా కొందరు ఈగోకి పోతున్నారంటూ కామెంట్ చేశారు.

బిగ్ కాన్సెప్ట్ సినిమాలు కొత్త నటులను లేదా అంతగా పరిచయం లేని నటుల...