భారతదేశం, మార్చి 23 -- బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సామాన్య ప్రేక్షకుల నుంచి స్టార్ హీరోల వరకు అందరూ ఈ సినిమా మానియాలో మునిగిపోయారు.

ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఇండియన్ సినిమా గతిని మార్చిన లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా చేరిపోయాడు. ధురంధర్ ద రివెంజ్ సినిమా చూసిన వర్మ, ఈ సినిమా తన మీద ఎంత బలమైన ముద్ర వేసిందో చెబుతూ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఒక అదిరిపోయే పోస్ట్ పెట్టాడు. అసలు ఆ పోస్ట్‌లో ఏముందో, అతడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పాడో ఇక్కడ వివరంగా మాట్లాడుకుందాం.

ఎప్పుడూ తనదైన స్టైల్‌లో కుండబద్దలు కొ...