భారతదేశం, జూన్ 23 -- రాజీవ్ గాంధీ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ విశ్వవిద్యాలయం(RGUKT) శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల క్యాంపస్‌లో ఆరేళ్ల సమగ్ర ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 23న ప్రారంభమైంది. ఈ ప్రవేశాల ప్రక్రియ జూన్ 24 కూడా కొనసాగుతుందని విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు. రెండు సంవత్సరాల పీయూసీ, ఆపై నాలుగేళ్ల బీటెక్ ఇంజనీరింగ్‌తో కూడిన ఈ కోర్సుకు విద్యార్థుల్లో భారీ డిమాండ్ నెలకొంది.

ఈ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీలు జూన్ 23 నుంచి జూన్ 24గా ఉన్నాయి. సుమారు 1,000 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అర్హులు. క్యాంపస్ లోనే కౌన్సెలింగ్ ఉంటుంది.

కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికేట్లు, టీసీ, ఫొటోలు తదితర ప...