భారతదేశం, ఫిబ్రవరి 28 -- రేణు దేశాయ్ కు తీవ్రమైన కోపమొచ్చింది. తన గురించి నీచమైన కామెంట్లు చేస్తున్న వాళ్లపై ఆమె ఫైర్ అయింది. శనివారం (ఫిబ్రవరి 28) ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో రెచ్చిపోయింది. బూతులు పెట్టే వాళ్లను ఇకపై వదలనని వార్నింగ్ ఇచ్చింది.

''నా విడాకుల తర్వాత నా గురంచి అన్ని రకాలుగా కామెంట్ చేశారు. ఇంకా ఏం మిగల్లేదని అనుకున్నా. కానీ నేను జనవరిలో కుక్కల గురించి ప్రెస్ మీట్ పెట్టా. కొన్ని ఎన్జీవోలు కలిసి నన్ను ప్రెస్ మీట్ కు రమ్మంటే, ఫస్ట్ నేను రానని చెప్పా. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే నాకు తిట్లు రావడం తప్పా ఏం ఉండదు అని క్లియర్ గా చెప్పా. కానీ మీరు మాట్లాడితేనే బాగుంటుందని పిలిచారు'' అని రేణు దేశాయ్ తెలిపింది.

''వందల కుక్కులను చంపేస్తున్నారంటే నాకూ బాధ వేసింది. వంద కుక్కల్లో 10 పిచ్చివి ఉంటాయి. దాని కోసం 90 కుక్కలను చంపకూడదని ప్రెస్ మీట్ల...