భారతదేశం, ఆగస్టు 29 -- ఎంట్రీ-లెవెల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రెనాల్ట్ క్విడ్ సరికొత్త రూపంలో వాహన ప్రియులను పలకరించింది! బ్రెజిల్‌లోని సావోపాలో నగరంలో జరిగిన 'ఫెస్టివల్ ఇంటర్లాగోస్' వేదికగా 2027 క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ను కంపెనీ అధికారికంగా ఆవిష్కరించింది. కేవలం ఎక్స్‌టీరియర్ మార్పులకే పరిమితం కాకుండా, కారు లోపల కేబిన్‌ను లగ్జరీ కార్లకు సమానంగా రీ-డిజైన్ చేయడం ఈ కొత్త వెర్షన్ ప్రత్యేకత.

కొత్త రెనాల్ట్ క్విడ్ ముందు భాగంలో భారీ మార్పులు చేశారు. గ్లోస్-బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన రీ-డిజైన్డ్ ఫ్రంట్ గ్రిల్, దానికి సరికొత్త రెనాల్ట్ లోగోను అమర్చారు. సరికొత్త ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, స్పోర్టీగా కనిపిచే ఫ్రంట్ బంపర్, కొత్త సైడ్ గ్రాఫిక్స్ కారుకు సరికొత్త రూపాన్నిచ్చాయి. వెనుక వైపు డార్క్ టెయిల్ ల్యాంప్ డిజైన్, సాంప్రద...