భారతదేశం, అక్టోబర్ 6 -- Release Date: రిలీజ్ కు సమయం దగ్గరపడ్డ తర్వాత లేదా థియేటర్లకు మూవీ రావడానికి మూడు రోజుల ముందు సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పడం నయా ట్రెండ్ గా మారినట్లే కనిపిస్తోంది. తాజాగా ఆదర్శ కుటుంబం విషయంలోనూ ఇదే జరగడంతో మేకర్స్ తీరుపై సినీ లవర్స్ మండిపడుతున్నారు.

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం: హౌస్ నెం. 47' (AK47) చిత్రం అక్టోబర్ 9న విడుదల కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో మళ్లీ వాయిదా పడింది. ప్రెస్ మీట్‌లో నిర్మాత నాగవంశీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, సినిమా ఇంకా పూర్తి కాలేదని, ప్లానింగ్ లోపం, పరిశ్రమలో క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆదర్శ కుటుంబం మూవీ ఎప్పుడో ఏడాది క్రితం మొదలైంది. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇందుల...