భారతదేశం, అక్టోబర్ 25 -- భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బ్యాటరీ లైఫ్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వినియోగదారుల అంచనాలను, అభిప్రాయాలను అర్థం చేసుకునన ప్రముఖ మొబైల్ దిగ్గజం 'రియల్‌మీ'.. త్వరలోనే ఒక భారీ ఆయుధాన్ని దేశీయ మార్కెట్లోకి దించేందుకు సిద్ధమవుతోంది! ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్లలో 5,000ఎంఏహెచ్ లేదా 6,000ఎంఏహెచ్ బ్యాటరీలను ఎక్కువగా చూశాం. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఏకంగా 10,000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో సరికొత్త ప్రో సిరీస్​ని పరిచయం చేయడానికి కంపెనీ కసరత్తు చేస్తోంది.

ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్​లో ఎన్ని మోడల్స్​ ఉంటాయి అనేది దానిపై ప్రస్తుతం క్లారిటీ లేదు. కానీ వీటి పేర్లు 'రియల్‌మీ 17 ప్రో' లేదా 'రియల్‌మీ 17 ప్రో ప్లస్' ఉండొచ్చని, ఇవి భారత మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని ప్రముఖ టిప్‌స్టర్ ...