భారతదేశం, మార్చి 2 -- బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొనుగోలుదారుల ధోరణి మారుతోంది. గత రెండు మూడేళ్లుగా సాగిన కొనుగోళ్ల జోరు తర్వాత, ఇప్పుడు టెక్​ ఉద్యోగులు తమ నిర్ణయాలను పునరాలోచించుకుంటున్నారు. ఉద్యోగాల కోత, ఏఐ-ఆధారిత పునర్నిర్మాణం, స్థిరంగా ఉన్న ఇళ్ల ధరలు, పెరుగుతున్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొందరు భారీ రుణాలు తీసుకోవడానికి దూరంగా ఉంటుండగా, మరికొందరు అద్దె కంటే స్వల్పంగా మాత్రమే ఎక్కువగా ఉండే రూ. 75-85 లక్షల విలువైన ఇళ్లను ఎంచుకుంటున్నారు. లగ్జరీ హంగుల కంటే ఆర్థిక స్తోమతకే వారు పెద్దపీట వేస్తున్నారు.

ఇటీవల బెంగళూరుకు చెందిన ఒక ఐటీ నిపుణుడు రెడ్డిట్​లో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన రూ. 2.5 కోట్ల విలువైన ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్, ఇంటీరియర్స్ అన్నీ కలిపి ఆ మొత్తం రూ. 3 కోట్లకు చేరుతుందని అం...