భారతదేశం, ఆగస్టు 17 -- Ravi Teja: టాలీవుడ్ సీనియర్ హీరో రవితేజ నెట్టింట తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆదివారం (ఆగస్టు 16) రాత్రి జరిగిన 'ఇరుముడి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఒక చిన్నారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. పబ్లిక్ వేదికపై, అదీ ఒక భక్తిరస చిత్ర వేదికపై ఆయన వాడిన భాష పట్ల నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రవితేజ హీరోగా నటించిన ఇరుముడి మూవీ ఆగస్టు 21న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ సందర్భంగా ఓ ఫన్నీ ఇంటర్వ్యూ జరిగింది. సినిమాలో రవితేజ కుమార్తెగా నటించిన బేబీ నక్షత్ర మైక్ తీసుకొని రవితేజను కొన్ని ప్రశ్నలు అడిగింది.

''నాకు ముద్దు పేరు పెట్టాలంటే ఏం పెడతారు'' అని రవితేజను నక్షత్ర ప్రశ్నిచింది. కాసేపు ఆలోచించిన రవితేజ 'ముదురు...