భారతదేశం, ఏప్రిల్ 28 -- Ravi Babu: టాలీవుడ్ లో వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ నటుడు, దర్శకుడు రవిబాబు. హారర్, థ్రిల్లర్, కామెడీ ఇలా ఏ జోనర్ ఎంచుకున్నా అందులో తనదైన ముద్ర వేస్తుంటారు. ప్రస్తుతం ఆయన తన దర్శకత్వంలోనే నటిస్తూ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'రేజర్' (Razor) విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవిబాబు.. టాలీవుడ్ స్టార్ హీరోల యాక్షన్ సీక్వెన్స్‌లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలుగు సినిమాల్లో యాక్షన్ సీన్లు అన్నీ ఒకేలా ఉంటున్నాయని, అందులో సహజత్వం లోపిస్తోందని రవిబాబు అభిప్రాయపడ్డారు.

"ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో 90 శాతం మంది డూపుల సహాయంతోనే ఫైట్స్ చేస్తున్నారు. అసలు వాస్తవానికి దగ్గరగా ఉండే యాక్షన్ సీక్వెన్స్‌లు మన దగ్గర రావడం లేదు. అమెరికాలో ఒక కారు ఛేజ్ సీన్ జరుగుతుందంటే జనం నమ్ముతార...