భారతదేశం, ఏప్రిల్ 14 -- Rashmika Mandanna: టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా సన్నిహితుల సమక్షంలో ఫిబ్రవరి 26న వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లి రోజున రష్మిక మేకప్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది.

సాధారణంగా సెలబ్రిటీ పెళ్లిళ్లంటే గంటల తరబడి మేకప్, భారీ నగలతో హంగామా ఉంటుంది. కానీ రష్మిక మాత్రం చాలా సింపుల్‌గా, సహజంగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా మసూమ్ మినవాలా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రష్మిక పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ తన్వీ చెంబుర్కర్ ఈ 'మినిమల్ లుక్' వెనుక ఉన్న అసలు కథను బయటపెట్టారు.

తన్వీ గత నాలుగేళ్లుగా రష్మికతో కలిసి పనిచేస్తున్నారు. పెళ్లి రోజున మేకప్ కోసం రష్మిక కేవలం 90 నిమిషాలు (గంటన్నర) మాత్రమే సమయం కేటాయిం...