భారతదేశం, మార్చి 12 -- గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిగత దాడులు, దుష్ప్రచారంపై నటి రష్మిక మందన్న తీవ్రంగా స్పందించింది. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్న ఆమె.. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన, ఘాటైన వార్నింగ్ ఇచ్చింది. తన పేరిట వైరల్ అవుతున్న ఓ పాత ఆడియో క్లిప్ ను 24 గంటల్లో తొలగించాలని, లేదంటే లీగల్ యాక్షన్ అప్పదని రష్మిక హెచ్చరించింది.

గత ఎనిమిదేళ్లుగా మీడియాలోని ఒక విభాగం, కొందరు వ్యక్తులు తనపై పథకం ప్రకారం వేధింపులకు, అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని రష్మిక మందన్న ఆవేదన వ్యక్తం చేసింది. "నా మాటలను వక్రీకరించారు, నేను అనని మాటలను అన్నట్లుగా చిత్రికరించారు. కేవలం వ్యూస్, ఎంగేజ్మెంట్ కోసం నాపై ద్వేషాన్ని పెంచారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు విమర్శలు సహజమని ఇన్నాళ్లూ ఓపికగా, మౌన...