భారతదేశం, మార్చి 14 -- రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జోడీ గత కొన్ని వారాలుగా వార్తల్లో కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వీళ్ల వివాహం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో మార్చి 4న రిసెప్షన్ నిర్వహించారు. ఈ పెళ్లి, రిసెప్షన్ ఫొటోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడేమో డియర్ కామ్రేడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన్న స్పీచ్ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి రెండు సినిమాలు చేశారు. 2018లో గీత గోవిందం, 2019లో డియర్ కామ్రేడ్ సినిమాల్లో జోడీగా కలిసి కనిపించారు. అయితే గీత గోవిందం చేసిన తర్వాత విజయ్ తో మళ్లీ డియర్ కామ్రేడ్ లో కలిసి నటించేందుకు రష్మిక తన ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసింది. ఈ విషయాన్ని డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన్న స్వయంగా వెల్లడించింది.

"నేను నా తల్లిదండ్రులు, కుటు...