భారతదేశం, ఫిబ్రవరి 27 -- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ జంట గురువారం (ఫిబ్రవరి 26) పెళ్లితో ఒక్కటవడం, ఆ పోస్టును రష్మిక షేర్ చేయడం, ఆ వెంటనే గంటల్లోనే ఇది రికార్డులు బ్రేక్ చేయడం చూస్తుంటే వీళ్ల పెళ్లికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి తర్వాత షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా రష్మిక మందన్న తన పెళ్లి గురించి పెట్టిన పోస్ట్‌కు వచ్చిన స్పందన చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ పోస్ట్ షేర్ చేసిన కేవలం 16 గంటల్లోనే 18 మిలియన్లకుపైగా (కోటి 80 లక్షలు) లైకులను సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ న్యూస్ రాసే సమయానికి 18.7 మిలియన్ల లైక్స్ రావడం విశేషం.

గతంలో నటి కియారా అద్వానీ వెడ్డింగ్...